Research Leader shodhana Netha శోధన నేత full ముశం దామోదరరావు! శోధన నేత Updated : 4/16/2014 2:41:13 AM Views : 637 కొన్ని పనులు వ్యక్తులకు పేరుతెస్తాయి... ఇంకొన్ని పనులు వ్యక్తుల వల్ల పేరుతెచ్చుకుంటాయి! ఆ రెండో కోవలోని వ్యక్తే ముశం దామోదరరావు! ఆయనో పరిశోధనా గ్రంథం! చదివింది పదే.. నేర్చుకుంది పదిహేను భాషలు.. సేకరించింది పదిహేనువేల పుస్తకాలు.. దేశవిదేశాలకు సంబంధించిన వేల నాణాలు.. శోధిస్తున్నది... శాతవాహన, ఇక్షాకుల మూలాలు... పరిచయంచేసింది... పాలిస్టర్‌లూమ్.. భువనగిరికి! ఇవన్నీ లైఫ్ యూనివర్శిటీ ఆయనకు ఇచ్చిన క్వాలిఫికేషన్స్! అరుదైన ఆ పట్టభద్రుడితో ఓ చిన్న ములాఖాత్... హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌లో వెస్లీ స్కూల్‌లో పదవ తరగతి చదవుకుంటున్నప్పుడు.. పుస్తకాలంటే ఇష్టమేర్పడింది. ఒకసారి మా ఇంగ్లీష్ టీచర్ 1.25 పైసలిస్తే అమతవాక్కులు అనే పుస్తకం తెచ్చుకొని చదివాను. అందులో ఉన్న కొన్ని మాటలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఇక అక్కడి నుంచి నా చేతికి డబ్బులు వస్తే చాలు.. అంజలీ టాకీస్ దగ్గరకు వెళ్లి పాత పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని. అలా ఎక్కువ పుస్తకాలు చదవడంతో ఎక్కువ భాషలు నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ర...