stamp collection awards Philately, స్టాంప్ కలెక్షన్.. నాణాల మీద ఉన్న శ్రద్ధ క్రమంగా స్టాంపులమీదకు మళ్లింది. మన దేశ నాయకుల బొమ్మలు విదేశీ స్టాంపుల మీద ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదాహరణకు బల్గేరియా దేశ స్టాంపుపై నెహ్రూ, గాంధీల బొమ్మలు ఉన్నాయి. ఈ విధంగా 250 దేశాల స్టాంపులు, ఉర్దూలో నిజాం విడుదల చేసిన స్టాంపులు, 8 పైసల స్టాంపులు కూడా సేకరించా. ప్రపంచంలో మొట్టమొదటిసారి విడుదలైన స్టాంప్ వన్ పెన్ని నుంచి మొదలుకొని ప్రిన్స్ చార్లెస్ డయానా పెళ్లి సందర్భంగా మారిషస్ విడుదల చేసిన స్టాంప్ వరకు ఎన్నో ఉన్నాయి నా దగ్గర! 200 దేశాల కరెన్సీలతో పాటు.. క్లాక్ సిల్క్ మల్బరీ బార్క్‌నోట్స్, ఉడెన్‌నోట్స్ కూడా ఉన్నాయి. మెటల్ షార్టేజీ ఉన్నప్పుడు మెంగినీ అనే రాజ్యం అట్టపై విడుదల చేసిన నాణెం కూడా ఉంది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌సింగ్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్‌గా ఉన్నప్పుడు రూపాయి నోటుపై సంతకం చేసిన కరెన్సీకూడా నా దగ్గర భద్రంగా ఉంది.