Skip to main content

Posts

Showing posts with the label Helping hand to Handlooms in Bhongir

Helping hand to Handlooms in Bhongir

Helping hand to Handlooms in Bhongir   హ్యాండ్లూమ్ తయారీకి.. ఒకసారి బొంబాయి పోయిన. అక్కడ గోడౌన్‌లో పనికి రాని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్క్రాప్ తక్కువధరకు కొని భువనగిరి నేత కార్మికులకు సరఫరా చేసిన. అట్లా భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన. మా తాతా, నాన్నకు కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు ఉండేవి. వారివల్ల ఆయనతో నాకూ పరిచయం ఏర్పడింది. ఆయన సలహాతోనే గడ్డ మీది ఆగయ్యతో కలిసి నామాల గుండులో ప్రింటింగ్ ప్రాసెసర్‌ను స్టార్ట్ చేసిన. అట్లనే ప్యాంట్ బట్టలో పాలిస్టర్‌ను అతి కష్టమ్మీద కలిపి నేసినం. అందుకే భువనగిరిలో పాలిస్టర్ బట్టలకు సంబంధించిన వత్తి పనివారు అక్కడే స్థిరపడే అవకాశం దొరికింది.